భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,: జనవరి03
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది, డీజీపీ శివధర్ రెడ్డి లొంగిపోయిన మావోయిస్టులను ఈరోజు మూడు గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.బర్సే దేవాతో పాటు 20 మంది మావో యిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
అయితే మావోయిస్టు కీలక నేత బరిసె దేవా కూడా పోలీసుల ఎదుట లొంగి పోనున్నట్లు తెలుస్తోంది. బరిసె దేవాతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమలతోపాటు మరో 20 మంది కీలక మావో యిస్టులు లొంగిపోతున్నట్లు తెలుస్తుంది.బర్సే దేవాల లొంగుబాటు,ఆపరేషన్ కగార్ మావోయిస్టులో కీలక మార్పులు తీసుకువచ్చింది. మావోయిస్టులు ఒక్కొక్కరి గా బయటకు వస్తున్నారు.
వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగి పోతున్నారు. ఇందులో భాగంగా శనివారం మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారని, పోలీస్ అధికారులు తెలిపారు.
మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా బర్సే దేవా!
మావోయిస్టు అగ్రనేతగా ఉన్న బర్సే దేవా మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తున్న సంగతి తెలి సిందే.హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకపాత్ర పోషించిన దేవా, సాయుధ బలగాల వ్యవహారాలను చూసేవారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవా మావోయి స్టులకు ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషించినట్లు డీజీపీ మీడి యాకు వెల్లడించనున్నారు.
మరోవైపు హిడ్మాది కూడా ఛత్తీస్‌ఘడ్ ఇంకా చెప్పాలంటే ఇద్దరిదీ ఒకే గ్రామంగా తెలుస్తోంది. బర్సే దేవా ఆయుధాల సరఫరాలో కీలక పాత్ర పోషించేవారు.బర్సే దేవాతో పాటు మరొక 19 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.వారికి తెలంగాణ ప్రభుత్వం పునరావాసం కల్పించేం దుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
మరికాసేపట్లో డీజీపీ మీడియా సమావేశం!

డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన బర్సే దేవా నుంచి మౌంటెన్ ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.దేవాతో పాటు మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు కూడా సరెండర్ అయినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో బర్సే దేవాను మీడియా ముందుకు తీసుకురాను న్నారు.దేవా లొంగుబాటు, ఆయుధాల స్వాధీనం, మావోయిస్టులకు భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన అంశాలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరించే అవకాశం ఉంది.