.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ వ్యాఖ్యాత ఉదయభాను సినీ పరిశ్రమలో అవకాశాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుహాస్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, “ఇదొక్కటే చేశాను, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదు.
కార్యక్రమం మన చేతిలో ఉండదు, అంత పెద్ద సిండికేట్ ఎదిగింది” అని అన్నారు.
గతంలోనూ పరిశ్రమలో కుట్రలంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఉదయభాను వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి, సిండికేట్ ఆమెను అణచివేస్తుందన్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
