..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు నటులకు ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదు’
‘తెలుగు నటులకు ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదు’
యువ నటుడు కిరణ్ అబ్బవరం తన తాజా సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ, తెలుగు నటులకు ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో, తమ సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది దీపావళికి విడుదలైన తన చిత్రం KA తమిళనాడులో విడుదల కాలేదని, దీనికి కారణం స్క్రీన్లు దొరకకపోవడమేనని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువ నటుల సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, కానీ తెలుగు నటులు ఇతర రాష్ట్రాల్లో కొత్తగా ప్రయత్నించినప్పుడు మాత్రం థియేటర్లు దొరకడం లేదని ఆయన అన్నారు. తెలుగు ప్రేక్షకులు తమిళ స్టార్లను ప్రేమిస్తున్నారని, దానికి ప్రతిఫలంగా అదే ఆశిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
