భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇన్ ఆర్బిట్ మాల్ లో స్క్రీన్స్ నిర్మాణానికి అల్లు అరవింద్ పూజ.
విశాఖ:
పోర్టు హాస్పటల్ దగ్గర నిర్మిస్తున్న ఇన్ ఆర్బిట్ మాల్ లో ఏర్పాటు చేయనున్న సినిమా స్క్రీన్స్ కి ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం పూజలు చేశారు.
ఏషియన్ అల్లు అర్జున్ (ఎ.ఎ.ఎ.) సినిమా పేరిట మాల్ లోని 8 స్క్రీన్లు అరవింద్ తీసుకున్నారు.
ఇన్ ఆర్బిట్ మాల్ స్ట్రక్టర్ నిర్మాణం ఒక కొలిక్కి రావడంతో టాప్ ఫ్లోర్ లో అరవింద్ పూజా కార్యక్రమాలతో తదుపరి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
విశాఖ పరిసరాల్లో టీసీఎస్.. గూగుల్.. కాగ్నిజెంట్.. సత్వా.. ఏఎన్ఎస్ఆర్.. తదితర ఐటీ సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూడా ఊపందుకోనున్న నేపథ్యంలో మాల్స్ కు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.
కొత్తగా తిమ్మాపురం రామానాయుడు స్టూడియో దగ్గర యూనిటీ మాల్ పనులు ఇప్పటికే మొదలైన విషయం విదితమే.
