భారత్ న్యూస్ గుంటూరు…..కోట శ్రీనివాసరావు కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్లోని తననివాసంలో తుదిశ్వాస విడిచారు.
1942 జూలై 10వ తేదీన కంకిపాడు గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ తరుపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 1999 నుంచి 2004 మద్య కూడా పనిచేశారు.

కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించారు. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.