భారత్ న్యూస్ విజయవాడ…విజయ్‌కు విజిల్, కమల్ హాసన్‌కు 🔦టార్చిలైట్ గుర్తు
నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కజగమ్ (టీవీకే) పార్టీకి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం విజిల్ గుర్తును కేటాయించింది. మరో నటుడు కమల్‌హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి బ్యాటరీ టార్చ్‌ను కేటాయించింది.

రెండు పార్టీలకు కేటాయించిన ఉమ్మడి చిహ్నాలను వేరే ఇతర అభ్యర్థులెవరికీ కేటాయించమని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే వినియోగించుకోవాలని పేర్కొన్నది.