..భారత్ న్యూస్ హైదరాబాద్….కుక్క అరిచిందని హీరోయిన్ కొట్టింది
- డింపుల్ హయతిపై పనిమనిషి కేసు
హీరోయిన్ డింపుల్ హయతి, ఆమె భర్త డేవిడ్ తమను వేధిస్తున్నారంటూ వారి ఇంట్లో పనిచేసే ప్రియాంక బిబర్ (22) ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒడిశా రాష్ట్రం రాయఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక షేక్ పేటలోని వెస్ట్ వుడ్ అపార్ట్మెంట్ లో ఉంటున్న డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా చేరింది. మంగళవారం ఉదయం పెంపుడు కుక్క అరిచిందని, అందుకు తానే కారణమంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, తన దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు యత్నించారని ప్రియాంక ఫిర్యాదులో పేర్కొంది. డింపుల్ హయతి గల్ఫ్ సినిమాతో పరిచయమై ఖిలాడి, రామబాణం వంటి సినిమాలలో నటించింది.
