వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

భారత్ న్యూస్ రాజమండ్రి ….వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరి అనే మహిళా వీరాభిమానిని కలిశారు.

APలోని కర్నూలు(D) ఆదోనికి చెందిన ఆమె చిరును కలిసేందుకు అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ HYDకి వచ్చారు.

సైకిల్ పై అంత దూరం నుంచి వచ్చారని తెలిసి ఆశ్చర్య పోయిన చిరంజీవి రాజేశ్వరికి ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

దీంతో ఆమె ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతకుముందు ఆమె చిరంజీవికి రాఖీ కట్టారు….