భారత్ న్యూస్ రాజమండ్రి…స్టార్ హీరోకు సీబీఐ నోటీసులు
కోలీవుడ్ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ని విచారించాలని భావిస్తోంది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో విజయ్ను సీబీఐ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది.
