తెలుగు నటీమణుల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది…

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలుగు నటీమణుల ఫోన్లు ట్యాప్ అయినట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది…

ప్రముఖ నటి సమంత ఫోన్ ను ట్యాప్ చేశారని, నాగచైతన్య – సమంత దంపతులు విడిపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఏడాది క్రితమే ప్రచారం మొదలైంది.. ఇక మరో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేశారని ప్రచారం జరిగింది. కేటీఆర్ – రకుల్ మధ్య సాన్నిహిత్యం ఉందంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ బీజేపీ నేతలు బీ ఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పలుమార్లు రకుల్ రావు అంటూ కేటీఆర్ ను ఎద్దేవా చేశారు.

తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో నటీమణి హెబ్బా పటేల్ పేరును తెరపైకి తెచ్చారు.

హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేసినట్లు తనకు సమాచారం వచ్చిందని, అయితే అది నిజమో కాదో తెలియదంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి Zee news Telugu media నిర్వహించిన చర్చలో చెప్పారు.. అది నిజమో కాదో తెలియదు అని ఆయన చెప్పినప్పటికీ… హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేశారంటా.. అంటూ మీడియా, సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది..

అయితే ఈ ప్రచారాలపై అధికారులు స్పందించలేదు. ఇపుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం (సిట్) ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితులందరికీ నోటీసులు, సమాచారం ఇచ్చి వారి నుండి ప్రత్యక్షంగా వాంగ్మూలం(స్టేట్మెంట్) నమోదు చేస్తోంది..!

ఆరువందల పై చిలుకు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ కు గురైనట్లుగా ప్రాథమిక సమాచారం వచ్చింది కాబట్టి.. వాళ్ళందరి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియలో ప్రస్తుతం సిట్ ఉంది.

ఈ క్రమంలో నటీమణుల విచారణ వాంగ్మూలం నమోదు పై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది..

నటీమణుల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం నిజమే అయితే తప్పనిసరిగా వారి స్టేట్మెంట్ ను సిట్ రికార్డు చేసే అవకాశముంది..

అయితే భద్రతా, ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని సిట్ కార్యాలయానికి పిలిపించకుండా… నేరుగా ఎవరైనా అధికారి వెళ్ళి వాంగ్మూలం రికార్డు చేయవచ్చు..!

ఏది ఏమైనా నటీమణుల ఫోన్ల ట్యాపింగ్ పై ఏడాదిన్నరగా కొనసాగుతున్న ప్రచారంలో వాస్తవాలు ఏంటనేది త్వరలో తేలబోతోంది. వాంగ్మూలం నమోదు చేసిన వారి ఫోన్లు మాత్రమే ట్యాప్ కు గురైనట్లు నిర్ధారణ అవుతోంది కాబట్టి నటీమణులనుకు ఇచ్చే నోటీసులు సమాచారాన్ని బట్టి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.!

ఇపుడు సిట్ వాంగ్మూలం నమోదు కోసం నోటీసులు ఇచ్చి పిలిపిస్తోంది కాబట్టి బయటకి తెలియని సినీరంగానికి చెందిన వారు ఎవరైనా ట్యాపింగ్ బాధితుల్లో ఉన్నారా అనే విషయంపై కూడా త్వరలో స్పష్టత రానుంది..!