.బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అఖండ2..

.భారత్ న్యూస్ హైదరాబాద్….బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అఖండ2..

తొలిసారి పాన్ ఇండియా రేంజ్l లో విడుదల అవుతున్న సినిమా..

ఎంతో హైప్ వచ్చిన సినిమాకు… సినిమా కష్టాలు తప్పట్లేదు..

ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్స్ చేసిన వాళ్లకు డబ్బులు చెల్లించకపోవడం సినిమా విడుదల నిలిచిపోయింది..

ఉదయం ఎనిమిది గంటల నుండి సినిమా ప్రదర్శనలు ప్రారంభమవుతాయని రాత్రి ప్రీమియర్ షోలు మాత్రమే రద్దు అయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించినప్పటికీ… వాస్తవం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది..

ఆన్ లైన్ బుకింగ్స్ ముందుగా ప్రకటించినట్లుగా ఐదవ తేదీన కాకుండా అరవ తేదీన శనివారం నుండి ఓపెన్ అవుతున్నట్లు చూపిస్తోంది..

మొత్తంగా విడుదల.కావట్లేదని…మరోసారి ఫైనాన్సియర్లతో సమావేశం తర్వాత సినిమా విడుదలపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న మాట..

మొత్తానికి అఖండ విడుదలపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడడానికి మరికొంత సమయం పట్టే అవకాశమున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి…..