వైఎస్ జగన్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్…. మీ మద్దతుకు నా అభినందనలు అంటూ ట్వీట్

భారత్ న్యూస్ మచిలీపట్నం……Udaya Shankar.sharma News Editor…వైఎస్ జగన్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్…. మీ మద్దతుకు నా అభినందనలు అంటూ ట్వీట్

వైఎస్ జగన్ సంతాపం
దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మృతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు.’దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్‌కి అల్లు అర్జున్ ధన్యవాదాలు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. సంతాపాన్ని తెలియజేసినందుకు వైఎస్ జగన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కష్టసమయంలో మీ మద్దతుకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ తెలిపారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.