ఇక చైనాకు దబిడి దిబిడే…

అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తుల తయారీకి దేశంలోని కేంద్రాలను మరింత వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.తాజాగా భారత్ నుంచి అమెరికాకు దాదాపు 600 టన్నుల ఐఫోన్లను రవాణా చేసిందట.వాటి సంఖ్య దాదాపు 15లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే అమెరికా మార్కెట్లో సుంకాల ప్రభావాన్ని నివారించేందుకు కంపెనీ ఈ పెద్ద షిప్ మెంట్‌ను చార్డర్డ్ కార్గొ విమానాల ద్వారా పంపించింది. అమెరికాలో చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ పై భారీ సుంకాలు విధించిన సమయంలో ఈ చర్య తీసుకుందట. చైనా నుంచి వచ్చే ఐఫోన్స్ పై గరిష్టంగా 125 శాతం వరకు సుంకం విధించింది.గతంలో 54శాతం మాత్రమే ఉందట.. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులు కేవలం 26శాతం సుంకాన్ని మాత్రమే ఆకర్షిస్తున్నాయి. ఇది ప్రస్తుతం 90 రోజుల పాటు నిలిపివేసింది. దీని కారణంగానే యాపిల్ చైనా నుంచి కాకుండా భారత్ నుంచి సరఫరాలను పెంచేసింది. చైనా నుంచి దిగుమతులు ఇలాగే కొనసాగితే 1,599 డాలర్ల ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ధర అమెరికాలో 2,300 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా.