భారత్ న్యూస్ ఖమ్మం…..యూపీఐ పేమెంట్స్‌కు పదేళ్లు పూర్తి.. 49 శాతం వాటాతో భారత్‌దే అగ్రస్థానం..!
భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీల్లో ఏకంగా 49 శాతం వాటాతో భారత్ (India) అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. గణాంకాల ప్రకారం.. కేవలం 2026 జనవరి నెలలోనే యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.28.33 లక్షల కోట్లు.

దేశంలోని మొత్తం రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో 81 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.