9.75 లక్షల కోట్లు.. గడిచిన 11 ఏండ్లలో బ్యాంకులు రైటాఫ్‌ చేసిన రుణాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…9.75 లక్షల కోట్లు.. గడిచిన 11 ఏండ్లలో బ్యాంకులు రైటాఫ్‌ చేసిన రుణాలు

పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు.. బ్యాంకుల నుంచి తీసుకున్న అరకొర అప్పుల్ని బాధ్యతగా చెల్లిస్తుంటే, వందలు-వేల కోట్ల రూపాయల్లో పొందిన లోన్లను ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు కార్పొరేట్‌ కేటుగాళ్లు.

బ్యాంకుల్లో రెడ్‌ కార్పెట్‌ పర్చిమరీ ఇచ్చిన బడా రుణాలన్నీ మొండి బకాయిలుగానే మారిపోతున్నాయి. చివరకు ఆ అప్పుల కుప్పల్ని రైటాఫ్‌ల పేరిట తొలగించి ఖాతా పుస్తకాలను క్లీన్‌ చేసుకుంటున్నారు.

2019-20లోనైతే అత్యధికంగా రూ.1.59 లక్షల కోట్ల రుణాలను బ్యాంకర్లు సాంకేతికంగా తమ ఖాతా పుస్తకాల నుంచి తీసేశాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లోనూ లక్ష కోట్ల రూపాయలకుపైగా రుణాలు రైటాఫ్‌ అయినట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా రూ.47,568 కోట్ల లోన్లను బ్యాంకులు రైటాఫ్‌ చేసినట్టు వెల్లడించారు.

2014-15లో రూ.31,723 కోట్లు, 2015-16లో రూ.40,416 కోట్లు, 2016-17లో రూ.68,308 కోట్లు, 2017-18లో రూ.99,132 కోట్ల లోన్లు రైటాఫ్‌ అయ్యాయని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు వెల్లడించారు.