భారతదేశంలో అమెజాన్‌ చేస్తున్న(మోసాలపై ) విచారణలు జరుగుతున్నాయి

భారత్ న్యూస్ అనంతపురం…భారతదేశంలో అమెజాన్‌ చేస్తున్న
(మోసాలపై ) విచారణలు జరుగుతున్నాయి ….?

భారతదేశంలో అమెజాన్ (మరియు ఫ్లిప్‌కార్ట్)పై ప్రధానంగా రెండు రకాల విచారణలు జరుగుతున్నాయి:

  1. అంటీ-ట్రస్ట్ (పోటీ నియమాల ఉల్లంఘన) 2. FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) ఉల్లంఘనలు.

ఇవి 2020 నుండి కొనసాగుతున్నాయి. 2024 నుండి తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు దగ్గర ఉన్నాయి.

  1. అంటీ-ట్రస్ట్ విచారణ అంటే?

CCI – Competition Commission of India అనేది అక్రమ వ్యాపార పద్ధతుల పై విచారణ చేసే సంస్థ. దీని ప్రకారం అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌లో కొంతమంది “ప్రిఫర్డ్ సెల్లర్లు”కు ప్రాధాన్యత ఇస్తూ, వారి ప్రొడక్టులను సెర్చ్ రిజల్ట్స్‌లో పైకి తీసుకొస్తూ, ధరలు, ఇన్వెంటరీ మరియు ప్రమోషన్లపై పూర్తి నియంత్రణ చూపుతుందని ఆరోపణ. దీని వల్ల చిన్న అమ్మకం దారులు మరియు అటువంటి వస్తువుల ఇతర పోటీదారులకు హాని కలిగిస్తుంది. అలాగే, సామ్‌సంగ్, వివో వంటి ఫోన్ కంపెనీలతో కలసి కుట్రపూరిత ఎక్స్‌క్లూసివ్ లాంచ్‌లు చేస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి.

CCI డైరెక్టర్ జనరల్ ఇన్వెస్టిగేషన్ (DGI) పూర్తి చేసి 2024 ఆగస్టులో 1,000+ పేజీల రిపోర్ట్ విడుదల చేసి, అమెజాన్‌ను దోషిగా తేల్చింది.

దీనికి ప్రతిస్పందనగా CCI విచారణను ఆపమని అమెజాన్ మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మకం దారులు వివిధ హైకోర్టుల్లో 24 కేసులు దాఖలు చేసారు.

ఈ కేసులను ఏకీకృతం చేసి విచారణ వేగవంతం చేయమని CCI సుప్రీంకోర్టుని డిసెంబర్ 2024లో కోరింది. విచారణ సుప్రీంకోర్టు లో సా…గుతూ..నే ఉంది.

చిన్న వ్యాపారుల సంఘం (CAIT) అమెజాన్‌ ఆపరేషన్లు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.

  1. భారత FDI నియమాల ప్రకారం, విదేశీ e-కామర్స్ కంపెనీలు B2C (డైరెక్ట్ రిటైల్) చేయకూడదు, మార్కెట్‌ప్లేస్ మాత్రమే నడపాలి. కానీ అమెజాన్ ప్రిఫర్డ్ సెల్లర్ల ద్వారా ఇన్వెంటరీని కంట్రోల్ చేసి, FDI నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆరోపణ. దీనివల్ల చిన్న రిటైలర్లకు అన్యాయం జరుగుతోంది.

దీనిపై ED విచారణ చేస్తోంది, 2024 నవంబర్‌లో అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ల ఆఫీసులపై రైడ్స్ నిర్వహించింది, డాక్యుమెంట్లు సీజ్ చేసింది.

CCI మరియు ED విచారణలు చివరి దశకు చేరుకున్నాయి.

ఈ విచారణలు ఆపడానికి అమెజాన్ భారత్ లో భారీ ఎత్తున రహస్య లాబీయింగ్ కి పాల్పడింది అని రాయిటర్స్ వార్తా సంస్థ వార్త రాసింది.

అన్నట్లుగా ఇక్కడో అప్రస్తుత సంగతి చెప్పాలి…

వాషింగ్టన్ పోస్ట్ (WaPo) యజమాని అమెజాన్ యజమాని ఒక్కరే. అతడే జెఫ్ బెజోస్.

తమ కంపనీ విచారణల నిలిపివేతకు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఎటువంటి సానుకూల సూచనలు రావడం లేదు అనే అక్కసుతో మోడీ పై మరియు ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేందుకు
తమ వాషింగ్ టన్ పేపర్లో “తప్పడు”(negative)
వ్యాసాలు రాయించిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే, సుప్రీంకోర్టు ఆరోపణలు నిర్ధారిస్తే అమెజాన్ కంపనీ వేలకోట్ల రు.లు పెనాల్టీగా కట్టవలసి ఉంటుందని చెపుతున్నారు.