..భారత్ న్యూస్ హైదరాబాద్….కనీస బ్యాంక్ బ్యాలెన్స్ పెంపుపై ఐసీఐసీఐపై విమర్శలు
ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్‌ను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.50 వేలకు, సెమీ అర్బన్‌లో రూ.5 వేల నుంచి రూ.25 వేలకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఆగస్టు 1 తరువాత కొత్త కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. ఈ మార్పు ధనికులకు అనుకూలంగా ఉందంటూ జనాలు మండిపడుతున్నారు.
