భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగి మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.800 పెరిగి రూ.1,09,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.870 పెరిగి రూ.1,19,400 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.3,000 పెరగడంతో రూ.1,65,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
