గుడ్ న్యూస్ చెప్పిన BSNL.. కొత్తగా UPI సేవలు!

భారత్ న్యూస్ కర్నూల్….గుడ్ న్యూస్ చెప్పిన BSNL.. కొత్తగా UPI సేవలు!

📍ప్రభుత్వ యాజమాన్య టెలికాం సంస్థ BSNL త్వరలో తన సెల్ఫ్‌కేర్ యాప్‌లో యూపీఐ చెల్లింపు సేవలను అందించనుంది.

భీమ్ యూపీఐతో వచ్చే ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు సులభంగా రీచార్జ్, బిల్ చెల్లింపులు, ల్యాండ్‌లైన్, ఫైబర్ సేవల బుకింగ్ లాంటివి చేసుకోవచ్చు.

ఇప్పటివరకు ఇతర టెలికాం సంస్థలు ఈ సేవలను అందిస్తున్నప్పటికీ, ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా ఈ జాబితాలో చేరింది.

యాప్‌లో ఇప్పటికే “UPI Payments Coming Soon” అనే బ్యానర్ కనిపిస్తోంది.