భారత్ న్యూస్ అనంతపురం….ఇడుపులపాయ, వైఎస్సార్ జిల్లా.
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం.
వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ ఘన నివాళి
ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వైఎస్ విజయమ్మ, శ్రీమతి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
