భారత్ న్యూస్ శ్రీకాకుళం…..కోడూరు మండలం:
జయపురం:
టీడీపీ వీరాభిమాని ఆగిరి గౌతం ను పరామర్శించిన వైసీపీ యువనేత గౌతమ్
కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ చాణక్య మరియు కానిస్టేబుల్ కళ్యాణ్ 30/6/25 న దారుణంగా కొట్టడంతో చెయ్య మరియు కాలు ఫ్రాక్చర్ అయ్యింది.
కోడూరు లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ బైక్ విషమై ఏ.గౌతమ్ పై ఎస్ఐ ఛాణక్య మరియు కానిస్టేబుల్ కళ్యాణ్ కోడూరు స్టేషన్ లో అన్యాయంగా ఏ.గౌతమ్ ను హింసించి దారుణంగా కొట్టటం జరిగింది.
అనతరం స్టేషన్ కు సంబంధించిన కానిస్టేబుల్ గౌతమ్ ను జయపురంలో వారి ఇంటి వద్ద దింపి వెళ్లిపోగా ఏ.గౌతమ్ తల్లితండ్రులు గ్రామ సర్పంచ్ గారి భర్త మరియు టీడీపీ నేత పాలడుగు ఆనందరావు ను సంప్రదించి విషయం చెప్పగా వారు పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం వైద్యం కొరకు అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు రాగా పోలీసులు కొట్టారని చెప్పటంతో తాము వైద్యం చెయ్యమని అడ్మిట్ చేసుకోవటం జరగదని ఎంఎల్సీ కూడా పంపమని చెప్పగా వారు బందర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లగా అక్కడ అడ్మిట్ చేసుకొని వైద్యం చేసి రిపోర్ట్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని రిపోర్ట్ వ్రాయటం జరిగింది.
ఈరోజు వైసీపీ నేత గౌతమ్ ఏ.గౌతమ్ ను అతని తండ్రి రాజేష్ ను జయపురంలో వారి ఇంటి వద్ద పరామర్శించి ధైర్యం చెప్పటం జరిగింది.
