వలువురిని పరామర్శించిన యువనాయకులు సింహాద్రి వికాస్ బాబు

భారత్ న్యూస్ అనంతపురం .. ….వలువురిని పరామర్శించిన యువనాయకులు సింహాద్రి వికాస్ బాబు

చల్లవల్లి:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు సింహాద్రి వికాస్ బాబు ఆదివారం మండల వరిధిలోని నడకుదురులో పలువురిని పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జంపాన ఉమాహేశ్వరరావు కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చారు. ఉమామహేశ్వరరావు చిత్రపటం వద్ద వూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. ఉమామహేశ్వరరావు గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యునిగా ఉన్నారు. అనంతరం రాముడుపాలెంలో అనారోగ్యానికి గురై కోలుకుంటున్న మాతంగి శ్రీనివాసరావు కుమార్తె రత్నాంజలిని, లింగం కన్నారావు, సుబ్బారావులను వారి నివాస గృహాలకు వెళ్ళి వరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. వికాస్ బాబు వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.