భారత్ న్యూస్ ప్రతినిధి:::: పెదపాలపర్రులొ విజయవంతంగా ముగిసిన యోగాసనాలు:::: ఏలూరు జిల్లా ముదినేపల్లి::::: యోగా లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ముఖ్య అతిథులుగా విచ్చేసి, కైకలూరు నియోజక వర్గ శాసన సభ్యులు కామినేని శ్రీనివాస్ ఆదేశానుసారం ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో ఆధ్వర్యములో ప్రపంచ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ముదినేపల్లి టీ.డీ.పీ. పార్టీ మండల అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి పిలుపు మేరకు 11వ అంతర్జాతీయ యోగా ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు కార్యక్రమములొ భాగంగా ముదినేపల్లి లోని పెద్దపాలపర్రులోని పంచాయతీ అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లో యోగ కార్యక్రమంలో పాల్గొని ఆసనాల ఉపయోగాలు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి,పెదపాలపర్రు గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్,ఉప సర్పంచ్ గన్నమనేని వెంకటేశ్వరరావు, బి.జెపి పార్టీ కైకలూరు నియోజక వర్గ సోషల్ మీడియా కన్వీనీర్ బి.బి.వి.నరసింహారావు, గ్రామంలోని వివిధ శాఖల అధికారులు,అధ్యాపకులు, విద్యార్థిని,విద్యార్థులు,గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు మరియు నీటి ఉపయోగాలు వివరించి,ప్రతి ఒక్కరు వారి వారి పరిసరాలలో ఇంకుడుకుంటలు తవ్వించుకొని నీటి నీల్వలను పెంపొందించుకోవాలన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకుడుగుంటలను తవ్వించే కార్యక్రమం లోపాల్గొని, మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి,అందరూ చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం అల్పాహార విందుని ఏర్పాటు చేయించి అందరికి పంచారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, ముదినేపల్లి మండలాధ్యక్షుడు చల్లగుళ్ళ శోభనాద్రి చౌదరి, ఆదిత్య చౌదరి,అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
