అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కార్యదర్శి అమ్మిరాజు పిలుపునిచ్చారు

భారత్ న్యూస్ రాజమండ్రి….అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కార్యదర్శి అమ్మిరాజు పిలుపునిచ్చారు

తూర్పుగోదావరి :: దేవరపల్లి మండలం యర్నగూడెం

శారీరక మానసిక దృఢత్వాన్నందించే భారతీయ ప్రాచీన సంపద యోగా విశ్వవ్యాప్తంగా అభ్యసిస్తున్నారని 21శనివారం ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా భారీ స్థాయిలో యర్నగూడెం జడ్పీ హైస్కూల్ నందు ఉదయం6గంటలకు యోగాడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ బొంతా భరత్ బాబు తెదేపా నాయకులు పెన్మెత్స సుబ్బరాజు బొల్లిన విజయ భాస్కర్ గద్దె శ్రీనివాస్ సొసైటీ సీఈఓ మండ పెదబాబు తదితరులు పూర్తి సహాయ సహకారాలను అందించడమే కాకుండా టీషర్టులు అల్పాహారం వంటివి అందిస్తున్నారని పురప్రముఖులు అధికార అనధికారులు గ్రామస్తులు తప్పక పాల్గొనాలని గ్రామ పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు తెలిపారు…