భారత్ న్యూస్ విశాఖపట్నం..నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
మంగళగిరి :
ఏపీలో నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, పరిశీలకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సమావేశంలో జులై రెండోతేదీ నుంచి నిర్వహించనున్న ఇంటింటి ప్రచారంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
