ఎవరిని విధ్వంసం చేస్తారు…రాష్ట్రాన్నా? ప్రజలనా?: ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

..భారత్ న్యూస్ అమరావతి..ఎవరిని విధ్వంసం చేస్తారు…రాష్ట్రాన్నా? ప్రజలనా?: ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: సామాజిక మాధ్యమాల పోస్టింగ్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నట్లు ఫ్లెక్సీలు పెడతారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు.. రాష్ట్రాన్నా? రాష్ట్ర ప్రజలనా? అని ప్రశ్నించింది.

“సీఎంను అవమానించడమంటే 5 కోట్ల ఆంధ్రులను అవమానించడం కాదా? వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడుతారా? అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారు? వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేదే కాదు. కోర్టులు, చట్టమంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి. పోలీసులు కఠినంగా ఉంటే 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం ఎలా వస్తోంది? అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు” అని ఏపీ హైకోర్టు ఆక్షేపించింది. వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవడ్డి పిటిషన్పై హైకోర్టు విచారించింది. ఈ కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.