పట్టణాల్లో వైట్ కేటగిరీ కిందకు వచ్చే పరిశ్రమల భవనాల నిర్మాణ అనుమతుల

భారత్ న్యూస్ గుంటూరు…పట్టణాల్లో వైట్ కేటగిరీ కిందకు వచ్చే పరిశ్రమల భవనాల నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రిబేటు కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాలుష్య నియంత్రణ పాటిస్తున్న కొన్ని పరిశ్రమలకు మున్సిపల్ శాఖ ఇప్పటికే రిబేటు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్. కేటగిరి కింద ఉన్న పరిశ్రమలకు 25 శాతం రిబేటు అందిస్తోంది.

అయితే వైట్ కేటగిరీ కిందకు వచ్చే బయోగ్యాస్ వంటి తక్కువ కాలుష్య కారక పరిశ్రమలకు కూడా గ్రీన్ కేటగిరీ తరహాలో ఫీజులో 25 శాతం రిబేటు ఇవ్వాలని కొందరు బయోప్లాంట్ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది..