సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 కాదు… స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలి.

భారత్ న్యూస్ విజయవాడ…సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 కాదు… స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలి. ఎప్పుడో 22 ఏళ్ల తర్వాత పరిస్థితి గురించి కాదు …ఇప్పుడు గిరిజన బిడ్డలు పడుతున్న బాధలు గురించి పట్టించుకోవాలి. 2047 వరకు ఎదురు చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు చదువుతున్న బిడ్డలకు 2047 విజన్ ఏం ఉపయోగ పడుతుంది ? అందుకే స్వరాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 ను ప్రకటించాలి. రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లను బాగుచేయండి. హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచండి. మీరు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తాం. అన్ని సంక్షేమ హాస్టళ్లను సందర్శిస్తాం. హాస్టళ్లలో బిడ్డలతో సంతకాల సేకరణ చేపడతాం. కురుపాం లాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఒక హైలెవల్ కమిటీని వేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.