తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించిన విజయ్

.భారత్ న్యూస్ అమరావతి..తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించిన విజయ్

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించిన విజయ్
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ చేపట్టిన ర్యాలీలో శనివారం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మందిపైగా మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు. “నా హృదయం ముక్కలైంది. భరించలేని బాధలో ఉన్నాను. ప్రాణాలు కోల్పోయిన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలి” అని విజ‌య్ ట్వీట్ చేశారు.