భారీ నుండిఅతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున చల్లపల్లి

భారత్ న్యూస్ రాజమండ్రి ….భారీ నుండిఅతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున చల్లపల్లి మండలంలోని ప్రజలందరు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చల్లపల్లి తహశీల్దార్ కె. వనజాక్షి పేర్కొన్నారు. వీఆర్వోలు అందరూ అప్రమత్తతతో ఉండవలెననీ, నదీతీర గ్రామాలైన నడకుదురు, నిమ్మగడ్డ,వెలివోలు, ఆముదారులంక గ్రామాల నుంచి ఎవరూ లంక గ్రామాలకు గాని, నదిలోనికి గాని వెళ్లకుండా చూడవలెననీ ఆదేశించారు.
గుండేరు డ్రైన్ ఉన్న గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉన్నందున అక్కడ నివసించే వారికి తగు ముందస్తు జాగ్రత్తలు తెలియజేయవలెనని పేర్కొన్నారు.
భారీ వర్షాలు రానున్నందున సదరు విషయాన్ని మండలంలోని గ్రామాలలో ముందస్తు చర్యగా టాంటాం ద్వారా తెలియజేయాలని ఆమె చెప్పారు.