ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి,

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల, 2025 ఆగస్టు 12

ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి

ఈ నూతన విధానం ఆగస్టు 15 నుండి విధిగా అమలు

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీకు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది.

ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు.

ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది.

ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడమైనది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.