భారత్ న్యూస్ అనంతపురం,విద్యుత్ శాఖలో వసూల్ రాజా
యనమలకుదురు గ్రామంలో విద్యుత్ అధికారి వసూల్ రాజా అవతారం ఎత్తాడు. పైసలిస్తేనే పనిచేస్తున్నాడు. గృహ నిర్మాణం కనెక్షన్‌లకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు. కొందరు డబ్బులు చెల్లించినా మరికొంత కావాలని పట్టుబడుతున్నాడు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
విద్యుత్ శాఖలో వసూల్ రాజా
ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న అధికారి
ప్రజల అవసరాలకు పెద్దమొత్తంలో కలెక్షన్
యనమలకుదురు లాకులు వద్ద నుండి తాడిగడప రోడ్డు పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్‌లు ఇచ్చినట్టు ఆరోపణలు
ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపిన ఉపయోగం లేని పరిస్థితి
అయినా మారని అధికారి తీరు
యనమలకుదురు గ్రామంలోని ఓ విద్యుత్ అధికారి వసూల్ రాజా అవతారం ఎత్తాడు. పైసలిస్తేనే పనిచేస్తున్నాడు. గృహ నిర్మాణంలో భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు. విద్యుత్ శాఖ ఏ.ఈకి జర్నలిస్టులు సైతం కూడా బెంబేలెత్తిపోతున్నారు. పలువురు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేని పరిస్థితి.. అయినప్పటికీ ఆ అధికారి తీరు మార్చుకోకపోవడం వివాదాస్పదమైంది. ఈయన సాగిస్తున్న అవినీతి బాగోతంపై ఉన్నతాధికారులు కదులుతార లేదా వేచి చూద్దాం . ….✍️
పెద్దపులిపాక గ్రామంలో ఇటీవల ఆగస్టు నెలలో( ఏపీసిపిడిసిఎల్)లో మీసేవ ద్వారా ప్రభుత్వానికి సింగల్ ఫేస్ కనెక్షన్ అప్లై చేయడం జరిగింది. కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉన్న ట్రాన్స్ఫారం పెట్టాలి అని చెప్పి ట్రాన్స్ఫారం పేరుతో ఆసరా చేసుకొని విద్యుత్ శాఖ మండల అధికారి ఒకరు అందిన కాడికి దండుకుంటున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి దోచుకుంటున్నాడని ఆరోపణలు . పెద్దపులిపాక గ్రామంలో ఈ ఏడాది నుంచి కొంతమంది గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతకుముందు దరఖాస్తు చేసుకొన్న వారికి విద్యుత్ కనెక్షన్‌లకు ఎలా ఇచ్చారు.. ఈ విద్యుత్ అధికారికి గురించి ఉన్నత అధికారులకు లిఖితపూరితంగా తెలియపరిచిన ఉపయోగం లేదు .. ఈ విద్యుత్అధికారి పైఅధికారిని కలవగా ఆయన పైసలిస్తేనే పనిచేస్తానని చెప్పాడు. ఇలా అనేకమంది గ్రామస్తులు ఆయన ధనదాహాన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.
నిబంధనలు తూచ్
అక్రమ సంపాదనలో మునిగితేలుతున్న సదరు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారికి వెంటనే పనిచేస్తూ మిగిలిన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. భారతదేశంలో ఔత్సాహిక ఫోర్త్ స్టేట్ అయిన మీడియాని లెక్కచేయకుండా యనమలకుదురు విద్యుత్తు అధికారి జర్నలిస్టు సైతం డబ్బుల కోసం వేధిస్తున్నాడు. గతంలో సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలు.. మచ్చుకు ఉదాహరణ మాత్రమే ఇలాంటి వ్యవహారాలు ఇంకా అనేకం ఉన్నాయి.
,ఉన్నతాధికారులకు వాటాలంటూ గుంజుడు… 🖋️

‘విద్యుత్ కనెక్షన్లు ఊరికే రావు నాయనా.. నేను ఉన్నతాధికారులకు వాటాలు ఇవ్వాలి. మీరు నేను అడిగినంత చెల్లిస్తేనే పని అవుతుంది నాయనా!’ అంటూ ఆ జర్నలిస్ట్ తన వద్దకు పనికోసం వెళ్తే వారితో కరాఖండిగా చెబుతున్నారు. ఈ విద్యుత్ అధికారిపై ఏసీబీ అధికారులు నిఘా జరిపితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు మేలు చేసినట్టు జరుగుతుంది… 🖋️