భారత్ న్యూస్ విశాఖపట్నం..వందేమాతరం, జనగణమన ప్లే అవుతుంటే కచ్చితంగా నిలబడాల్సిందే..?
జాతీయం :- మన భారతదేశంలో అధికార కార్యక్రమాలు జరిగినప్పుడు, జెండా ఎగరవేసి సమయంలో అలాగే రాష్ట్రపతి లేదా గవర్నర్ వంటి ప్రముఖ వ్యక్తులు ప్రసంగాలు చేస్తున్న సందర్భంలో కచ్చితంగా వందేమాతరం పూర్తి వర్షన్ పాడాల్సిందే అని తాజాగా కేంద్రం కొన్ని కొత్త రూల్స్ తీసుకు వచ్చింది.
పైన పేర్కొన్న సందర్భాలలో కచ్చితంగా వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఒకే ఈవెంట్ లో వందేమాతరం మరియు జనగణమన పాడాల్సి వస్తే మొదటగా వందేమాతరమే పాడాలి అని స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడాల్సిందే అని.. మన జెండాకు అలాగే మన వందేమాతరం వంటి దేశభక్తి గీతాలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. వందేమాతరం జనగణమన ఇవి రెండు ప్లే అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడాల్సిందే అని హెచ్చరించింది.

ఒకవేళ సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్ రీల్ వంటి సమయంలో మధ్యలో వందేమాతరం వంటివి వస్తే థియేటర్లలో నిలబడాల్సినటువంటి అవసరం లేదు అని తెలిపింది. కాగా ఈరోజుల్లో చాలామంది జాతీయ గీతాలు పట్ల అలాగే దేశ జెండాను గౌరవించని కొన్ని సందర్భాలు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దీంతోనే కేంద్రం కొన్ని విషయాలు తప్పనిసరి చేస్తూ తాజాగా కొన్ని కొత్త రూల్స్ కేంద్రం తీసుకువచ్చింది.
జై హింద్, జై భారత్