భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .పోస్టాఫీసుల్లో యూపీఐ సేవలు ప్రారంభం
ఇప్పటి వరకు పోస్టాఫీసుల్లో లావాదేవీలు చేయాలంటే తప్పనిసరిగా నగదు అవసరం ఉండేది.
ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసుల్లో యూపీఐ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 32 ప్రధాన, 689 సబ్, 5,006 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో యూపీఐ చెల్లింపులు చేసుకునే సౌకర్యం కల్పించారు.
ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా చెల్లించుకునే ఈ సదుపాయం వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించనుంది.