తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు

భారత్ న్యూస్ రాజమండ్రి…తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అల్లూరి, విశాఖ జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి.