భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలో ఎన్ని అనధికారిక విగ్రహాలు ఉన్నాయంటే?
ఏపీలో అనధికారిక విగ్రహాల లెక్క తేలింది.
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బుధవారం రోజున శాసనమండలిలో ఈ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో 2524 అనధికారిక విగ్రహాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
వీటిని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రాష్ట్ర హైవేల మీద అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అనధికారిక విగ్రహాల తొలగింపుపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి వివరించారు~£