భారత్‌ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు.. స్వయంగా స్వాగతం పలికిన మోదీ

భారత్ న్యూస్ గుంటూరు….భారత్‌ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు.. స్వయంగా స్వాగతం పలికిన మోదీ

🇦🇪 మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆయన కుటుంబ సభ్యులను కొత్త అధికార నివాసానికి మోదీ తీసుకెళ్లారు. భారత సంప్రదాయ బహుమతులను వారికి అందజేశారు. సుమారు రెండు గంటల అధికార పర్యటనకు వచ్చిన యూఏఈ అధ్యక్షుడితో పలు అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు.

మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు రెండు గంటల పర్యటనకు ఆయన విచ్చేశారు. యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. గత పదేళ్లలో ఐదో పర్యటన కావడం విశేషం.