భారత్ న్యూస్ :తిరుపతి:శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలలో స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ కు హాజరైన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు
👉 ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి హాజరైన పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థినులు.
👉 ముఖ్య అతిథిగా హాజరైన తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు.
👉జ్యోతి ప్రజ్వలన చేసి, స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
👉జాతీయ జెండా ఎగురవేసి,క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు.
👉ఈ సందర్భంగా క్రీడాకారులను,విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు.
👉విద్యార్థుల జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని,క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం,జట్టుతో అంకిత భావం పెరుగుతుందన్నారు.
👉గెలుపు–ఓటమి కంటే ప్రయత్నం, క్రీడా స్పూర్తి ముఖ్యమైనదని తెలిపారు.
👉క్రీడల్లో పాల్గొనే విద్యార్థి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దైర్యం గా ఎదుర్కొంటారన్నారు.
👉తను కూడా పాలిటెక్నిక్ విద్యార్థి అని,కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే సమయంలో క్రీడలలో పాల్గొని,విద్యార్థి సంఘం నాయకుడు గా ఉన్నానని తెలిపారు.
👉విద్యార్థి జీవితం నుండి తను అన్ని విషయాలలో చురుగ్గా పాల్గొనే వాడినే అని,దానివల్లే నేను ఈ స్థాయి కి ఎదిగా అని తెలిపారు.
👉నాపైన విశ్వాసంతో ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు తనకు అతి చిన్న వయసులోనే తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు.
👉ప్రతి విద్యార్థి కూడా చదువుతోపాటు,క్రీడలలో పాల్గొని, భవిష్యత్తులో రాణించాలని తెలిపారు.
👉అంతకముందు పద్మావతి పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు ఘన స్వాగతం పలికి, దుశ్శలవతో, మెమెంటోతో సత్కరించారు.

👉ఈ కార్యక్రమంలో తితిదే ఎవిఎస్వో రామ్ కుమార్ గారు, ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ గారు,తిరుపతి డిప్యూటీ సెక్రటరీ ఏపీ ఎస్బిటిఈటి వెంకట సుబ్బా రావు గారు, తితిదే సూపరిండెంట్ శివకుమార్ గారు, తిరుపతి తెదేపా నాయకుడు ప్రణీత్ గారు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.