భారత్ న్యూస్ అనంతపురం….ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళాలు
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలo ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం అధికారులు నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి,చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని అలాగే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్పూర్తితో రాష్ట్ర అభివృద్దికి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు.
ఈ కార్యక్రమములో రాష్ట్ర సగర(ఉప్పర) సంక్షేమ మరియు అభివృధి కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ,ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ,ఏ ఓ నరసింగ రావ్,టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశులు,ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు సిద్ధలింగప్ప, నీరుగంటి చంద్రశేఖర్,త్రి మ్యాన్ కమిటీ సభ్యులువడ్డీసురేష్,యం.కిష్టప్ప,బీజేపీ మండల కన్వీనర్ మంజునాథ్,మాగేచెరువు సర్పంచ్ నరసింహులు,చాకర్లపల్లి శ్రీరాములు,గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి,రామిరెడ్డి,జనసేన నాయకులు రంగేపల్లి నాగరాజు,గంగాధర్, క్లస్టర్ ఇంచార్జ్ మద్దిలేటి,వెలగమేకలపల్లి నరసింహులు,పందిపర్తి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మూర్తి,బ్రాహ్మణపల్లి ఇర్ఫాన్ భాష,హరి,వడ్డీ అనిల్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
