భారత్ న్యూస్ విజయవాడ…నవలంక వెళ్లేవారికి అనుమతులు ఉన్నాయా..?
నాగాయలంక కృష్ణా నది మధ్యలో నదీ వరద ప్రవాహంతో ఏర్పడిన దిబ్బ నవలంక… ఈ నవ లంకకు వెళ్లాలంటే పడవ మార్గమే శరణ్యం అలాంటి నవలంక రాత్రి సమయాల్లో గెట్ టుగెదర్ కార్యక్రమాలు అంటూ సరదాగా గడపడానికి చాలామంది వెళ్తున్నారు.. ఈ క్రమంలో పడవల ద్వారా వెళ్లాల్సి ప్రక్రియలో లైఫ్ జాకెట్ లాంటివి గాని ఉపయోగించకపోవడం.. అర్ధరాత్రి వరకు అక్కడ గడపడం ఇలాంటి సమయంలో అసాంఘిక కార్యక్రమంలో కూడా తావు ఇవ్వడానికి ఆస్కారం ఉంది.. ఈ క్రమంలో ఈరోజు డిసెంబర్ 31 కావడంతో ఈరోజు కూడా ఎక్కువమంది ఆ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది కావున సంబంధించిన అధికారులు దీనిపై పర్యవేక్షించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు
దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు వాళ్ల స్వలాభం కోసం వారి యొక్క వ్యక్తిగత వ్యాపార లావాదేవీల కోసం పబ్లిసిటీ కోసం మత్స్యకారుల జీవనోపాధి సైతం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కొందరు మత్స్యకారుల ఆవేదన వెలిబుచ్చారు
