భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. రాజధాని అమరాతి నగరాన్ని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్వర్క్ ను కలపాలని సీఎం కోరారు. కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విన్నవించారు….
