ట్రాక్‌పై రాళ్లకు చెక్: రైల్వే కొత్త సేఫ్టీ ప్లాన్!

భారత్ న్యూస్ గుంటూరు…ట్రాక్‌పై రాళ్లకు చెక్: రైల్వే కొత్త సేఫ్టీ ప్లాన్!

రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ సరికొత్త ‘సేఫ్టీ మెకానిజం’ను తీసుకొచ్చింది. పట్టాలపై ఉండే రాళ్లు, చెత్తను తొలగించేందుకు ఇంజిన్ ముందు భాగంలో ప్రత్యేకమైన మెటల్ ప్లేట్‌ను అమర్చారు. రైలు వెళ్లేటప్పుడే ఇది ట్రాక్‌ను క్లీన్ చేస్తూ వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.