దీపావళికి టిడ్కో ఇళ్లు పంపిణీ – మంత్రి నారాయణ

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…దీపావళికి టిడ్కో ఇళ్లు పంపిణీ – మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని, దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని నగర అభివృద్ధి మంత్రి నారాయణ ప్రకటించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరాడంబరంగా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి భారీగా అప్పులు చేశారు… రూ.10 లక్షల కోట్ల బాదుడు ప్రజలపై మోపబడిందని మంత్రి విమర్శించారు.

అలాగే, వచ్చే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలకు ప్రయాణ భారం తగ్గుతుందన్నారు.