ఏపీలో టికెట్ తనిఖీల ద్వారా ఒక్కరోజులో రూ.35.46 లక్షలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో టికెట్ తనిఖీల ద్వారా ఒక్కరోజులో రూ.35.46 లక్షలు

విజయవాడ :

ఏపీలో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిని కట్టడి చేసేందుకు రైల్వే కమర్షియల్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 6న మెగా టికెట్ తనిఖీలు నిర్వహించగా జరిమానాల రూపంలో రికార్డు స్థాయిలో రూ.35.46 లక్షల ఆదాయం లభించింది. గత ఏడాది ఒక రోజు ఇలా తనిఖీ చేసినప్పుడు సుమారు రూ.34 లక్షలు వచ్చాయి.