భారత్ న్యూస్ గుంటూరు….9 అంతస్తుల భవనం నుంచి దూకి ముగ్గురు బాలికల ఆత్మహత్య
కొరియన్ గేమింగ్ యాప్‌నకు బానిసలైన బాలికలు
నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను….ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికల్లో ఒకరు రాసిన చివరి మాటలు ఇవి. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12, 14, 16 ఏండ్ల వయసున్న ముగ్గురు బాలికల ఆత్మహత్యకు గుర్తుతెలియని కొరియన్ టాస్క్-బేస్డ్ గేమింగ్ యాప్ కారణమని తొలుత వార్తలు వచ్చినప్పటికీ పోలీసులు ఆ తర్వాత గేమింగ్ యాప్ కోణాన్ని కొట్టివేశారు. కొరియన్ సంస్కృతి, కొరియన్ వినోదాన్ని తాము ప్రేమిస్తున్నట్లు ఆ బాలికలు తమ డైరీలో రాసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కొరియన్ సంస్కృతిని తాము ప్రేమిస్తున్నామని, కే-పాప్ సంస్కృతి, కొరియన్ సినిమాలు, కొరియన్ సంగీతం, కొరియన్ షార్ట్ ఫిల్మ్స్, కొరియన్ షోలు, కొరియన్ కథలను తాము ఇష్టపడుతున్నట్లు తమ డైరీలో వారు రాసుకున్నారు. తమ కుమార్తెలు అటువంటి కంటెంట్‌ను చూడడంపై అభ్యంతరం తెలిపిన బాలికల తల్లిదండ్రులు వారి ఫోన్లను లాక్కున్నారని, ఈ కారణంగానే ఆ బాలికలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.