భారత్ న్యూస్ తిరుపతి.పల్లెల్లో వరుస దొంగతనాలు
పోలీసులకే సవాల్ విసురుతున్న దొంగలు
BRK న్యూస్ సూళ్లూరుపేట
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండలాలలోని పల్లెల్లో వరుస దొంగతనాలకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. మొన్న కల్లూరు కండ్రిగ, మానేరి,శ్రీధనమల్లి, నిన్న సామంతమల్లాం, ఈరోజు ఆబాక అమ్మలపాడు, మీజురు గ్రామాలలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మోటార్ సైకిల్స్, సెల్ ఫోన్లు, డబ్బులు దొంగతనాలు చేస్తూ పల్లెల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాత్రి
కిలివేటి రవణమ్మ ఇంట్లో ఒక సెల్ ఫోన్ దొంగతనం డబ్బులు 2000,
కొల్లపాటి రమణయ్య ఇంట్లో లక్ష రూపాయలు చోర,
ఎలింబెట్టి పాలమ్మ ఇంట్లో సెల్ ఫోను,
పదివేల రూపాయలు డబ్బులు చోరీ,రాత్రి దొరవారి సత్రం మండలం మీజూరు గ్రామంలో 4 సెల్ ఫోన్స్ దొంగతనం జరిగింది. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవాలని పల్లెల్లోని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
