అంబేద్కర్ కోనసీమ జిల్లా…..సఖినేటిపల్లి మండలం అంతర్వేది లో ఉద్రిక్తత..

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…అంబేద్కర్ కోనసీమ జిల్లా…..

సఖినేటిపల్లి మండలం అంతర్వేది లో ఉద్రిక్తత..

అంతర్వేదికర లో వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటుచేసిన కాపు సంఘాలు.

ఆ విగ్రహాన్నికి పరిమిషన్ లేదు అంటూ తొలగించిన పోలీసులు.

పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటున్న కాపు సంఘాలు..

విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాపు సంఘాల నేతలు.

విగ్రహాన్ని మళ్లీ అదే ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలను, అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయడంతో ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది.

పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించిన, అవి ఏమి లెక్కచేయకుండా తిరిగి విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఏర్పాటుచేసిన కాపు సంఘాలు. ఈ సమయంలో రంగా విగ్రహానికి చేయి విరిగిపోయింది దీనితో మహిళలు పోలీసులను ఎందుకు విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని నిలదీశారు..

ఈ సమయంలో పోలీసులు, కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది.