భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Ammiraju Udaya Shankar.sharma News Editor…AP: ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం డుంబ్రిగుడలో అత్యల్పంగా 3.8 డిగ్రీలు నమోదైంది. జి. మాడుగులలో 4.1, హుకుంపేట 6.2, ముంచంగిపుట్టు, పాడేరు 6.9, పెదబయలు 7.1, చింతపల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల మంచు దట్టంగా పేరుకుపోయి కనిపిస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…
