భారత్ న్యూస్ గుంటూరు…రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు
నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామస్థులు ఇటీవలే అంతర్వేది వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం వారు తమ నివాసాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు బాధితుల నివాసాలకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో నాగాయలంక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు,పార్టీ నాయకులు ఉప్పల ప్రసాద్,తాడేపల్లి పాపారావు,ఈవూరి నాగార్జున,పులుగుజ్జు నాగరాజు,లోయ నాంచారయ్య,కారంకి కృష్ణ,కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు,ధర్మరాజు,తమ్ము తాతారావు,నాగిడి వెంకటేశ్వరరావు,నాగిడి నరసింహారావు,విశ్వనాథపల్లి వీరబాబు,కొక్కిలిగడ్డ రమేష్,తమ్ము నాగేశ్వరరావు,వనమాల రామారావు,తమ్ము శివాజీ,కారని వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
