పుల్వమా అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ,బీజేపీ నేతలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….పుల్వమా అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన టీడీపీ,బీజేపీ నేతలు

పుల్వమా దాడి జరిగి రోజు సందర్భంగా, దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ అవనిగడ్డలో టీడీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నాయకులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల కన్వీనర్ జీవీ నగరాయలు,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భోగాది చంద్రశేఖర్,అవనిగడ్డ నియోజకవర్గ కిసాన్ మోర్చా కన్వీనర్ భూపతి సుబ్రహ్మణ్యం టీడీపీ నేతలు మండలి రామమోహనరావు,బండే రాఘవ,దాసినేని శ్రీనివాసరావు,ఘంటసాల రాజమోహనరావు,మెగవత్తు గోపి,చెన్ను బాబూరావు,కంచర్ల ఆనంద్,నాగిడి రాంబాబు,ముళ్లపూడి శ్రీనివాసరావు,కమ్మిలి సుబ్రహ్మణ్యం,యక్కటి అర్జునరావు,కూనపరెడ్డి చంద్రశేఖర్, దాసినేని సాంబయ్య,రేపల్లె ప్రతాప్ ,షేక్ బాబావలి,చెన్నగిరి అయ్యప్ప,మైలా హరిబాబు,బచ్చు ఆదినారాయణ రావు తదితరులు పాల్గొన్నారు